komatireddy venkat reddy | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలంటూ బంద్ కొనసాగిస్తున్నారని తెలిసిందే. సినీ కార్మికులు తమ సమస్యల గురించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో లేబర్ కమిషనర్ ఆఫీసుకు కూడా వెళ్లారు. మరోవైపు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై చిరంజీవితో నిర్మాతలు సమావేశమై చర్చలు జరిపారు.
కాగా సినీ కార్మికుల ఆందోళనలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సినీ కార్మికుల వేతనాలను పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీ అంశాలన్నీ దిల్ రాజుకు అప్పగించాం. సినీ కార్మికుల ఆందోళనపై దిల్ రాజు చర్చిస్తున్నారు. సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు అనుమతి ఇస్తున్నాం. కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
JSK | అనుపమ పరమేశ్వరన్ జేఎస్కే మూవీ పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ.. ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా..?