జాతిరత్నాలు సినిమాతో ఓవర్‌నైట్ పాపులర్ అయిపోయింది హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ఆ తర్వాత బంగార్రాజులో స్పెషల్ సాంగ్‌లో కూడా మెరిసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది ఈ డ్యాన్సింగ్ క్వీన్. తక్కువ టైంలోనే తమిళ ప్రేక్షకులను కూడా పలుకరించేందుకు రెడీ అయింది ఫరియా అబ్దుల్లా. కోలీవుడ్ డెబ్యూ మూవీ వల్లి మయిల్ (Valli Mayil). సుశీంద్రన్ (Suseenthiran)డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం గత నెలలో సెట్స్ పైకి వెళ్లింది. తాజాగా మేకర్స్ ఫరియా అబ్దుల్లా పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ..ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఫరియాఅబ్దుల్లా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో.. సంప్రదాయక వస్త్రధారణతో కూడిన లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఈ సినిమా హీరో విజయ్ ఆంటోనీ బర్త్ డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో సత్యరాజ్, భారతీ రాజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 1980ల బ్యాక్ డ్రాప్లో సాగనుంది.
తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. ఫరియా అబ్దుల్లా ట్రెడిషనల్ లుక్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఫరియా ఫస్ట్ లుక్‌లో కనిపించినట్టు ట్రెడిషనల్ రోల్ లో కనిపిస్తుందా..? లేదా..? అనే దానిపై కొత్త అప్డేట్ వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Hi #ValliMayil wishing a blissful Birthday😊🎁@fariaabdullah2 pic.twitter.com/TCAqNoMpbl
— vijayantony (@vijayantony) June 21, 2022
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్‌పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్‌లో అజిత్ స్టిల్స్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది