Raja Saab | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి టాలీవుడ్ దర్శకుడు మారుతి డైరెక్షన్లో నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్ (Raja saab). హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలబారు భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
హీరోయిన్ మాళవిక మోహనన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోమవారం స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే గతంలో ప్రకటించిన విడుదల తేదీ ఈ పోస్టర్లో కనిపించకపోవడంతో సినిమా రిలీజ్‌పై డైలామాలో పడిపోయారు అభిమానులు. తాజా పోస్టర్లో రిలీజ్ డేట్ మిస్సవడంతో సినిమా మళ్లీ వాయిదా పడుతుందా..? ఏంటీ.. అని తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజాసాబ్ చిత్రాన్ని మేకర్స్ 2026 జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించారంటూ కొత్త వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో అభిమానులు రాజాసాబ్ విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలంటూ మేకర్స్‌ను కోరుతున్నారు. దయచేసి మౌనం వీడి సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని మేకర్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ సినిమా విడుదల వాయిదా పడితే ఇది రెండోసారి అవనుంది. మరి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తుందేమో చూడాలి.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Film Chamber | సాప్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు.. సినీ కార్మికుల నిరసనపై ప్రసన్న కుమార్
JSK | అనుపమ పరమేశ్వరన్ జేఎస్కే మూవీ పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ.. ఏ ప్లాట్ఫాంలోనో తెలుసా..?
Kingdom Banner | విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ బ్యానర్లు చించేసిన తమిళ ప్రజలు.. ఎందుకంటే?