Power star puneeth rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం కన్నడ చిత్రసీమతో పాటు అన్ని ఇండస్ట్రీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగి తేలుతున్నారు. తమ అభిమాన హీరోను చివరిసారి చూసేందుకు అభిమానులు మొదట విక్రమ్ ఆస్పత్రికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పునీత్ భౌతికకాయాన్ని విక్రమ్ ఆస్పత్రి నుంచి సదాశివనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ క్రమంలో తమ అభిమాన హీరో కోసం అంబులెన్స్ వెనుక వేలాదిమంది అభిమానులు ఫాలో అయ్యారు. అభిమానుల ఆందోళన దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అలాగే అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచాలని నిర్ణయించారు. ఈ విషయం తెలిసి చివరిచూపు కోసం అభిమానులు స్టేడియం వద్దకు తరలివస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా