Anushka Shetty | లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే అతికొద్ది నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది టాలీవుడ్ బ్యూటీ అనుష్కా శెట్టి (Anushka Shetty). ఈ భామ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఘాటి (Ghaati). క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే బెంగళూరు భామ అనుష్క ఘాటి చిత్రాన్ని పబ్లిక్‌గా ప్రమోషన్స్ చేయడం లేదని తెలిసిందే. అయితే ఇటీవలే టాలీవుడ్ యాక్టర్ దగ్గుబాటి రానాతో కలిసి ఫోన్‌కాల్‌లో సంభాషించి ప్రమోషన్స్‌లో పాల్గొన్నది స్వీటీ. ఆ తర్వాత రెడ్ ఎఫ్ఎం రేడియోలో కూడా ప్రత్యక్షమై ఘాటిని ప్రమోట్ చేసింది. అయితే మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ఇక అభిమానులతో నేరుగా మాట్లాడేందుకు రెడీ అయింది అనుష్క. ఎక్స్‌లో నేడు సాయంత్రం 6:30 గంటలకు ఈ సెషన్ లైవ్ మొదలు కానుంది.
సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసేందుకు ఎక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఎక్స్‌లో సాగనున్న ఈ సెషన్‌కు యూవీ క్రియేషన్స్ హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఇంకేంటి మరి అనుష్కను ఘాటి గురించి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకునే అభిమానులు రెడీగా ఉండండి.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్‌తోపాటు గ్లింప్స్ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఘాటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
Anushka Shetty | అనుష్క సరోజ 2 చేయాలని చెప్పిందట.. ఇంతకీ క్రిష్ ప్లాన్ ఏంటో మరి..?