Allu Arjun | చిరంజీవి స్పూర్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కష్టంతో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. పుష్ప చిత్రంతో బన్నీ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాడు. పుష్ప2 చిత్రంతో ఆయన ఇమేజ్ ఎల్లలు కూడా దాటింది. కెరీర్‌ని జాగ్రత్తగా మలచుకుంటూ వస్తున్న బన్నీ లేనిపోని చిక్కులలో పడుతుండడం ఫ్యాన్స్‌ని ఆందోళనకి గురి చేస్తుంది.ముందుగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చేయడం, అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం, వెంటనే ఆయన జైలు నుంచి బయటకు రావడం మనం చూశాం.
తెలంగాణా అసెంబ్లీలో సీఎం రేవంత్ కేసు గురించి మాట్లాడటం, అనంతరం బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, ఇదే క్రమంలో పోలీసుల ప్రెస్ మీట్, అల్లు అర్జున్ మీద పలువురు నేతలు విమర్శలు చేయడం, ఆసుపత్రిలో ఉన్న రేవతి కుమారుడిని పరామర్శించడం ఇలా బన్నీ కొద్ది రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారాడు. అల్లు అర్జున్, శ్రీలీల ప్రకటన కూడా వివాదాస్పదం అయింది. కార్పోరేట్ కాలేజీలకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ విద్యార్ధులు, తల్లిదండ్రులని మోసం చేస్తున్నారని వారిపై కేసు నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఇక తాజాగా అల్లు అర్జున్ ఆపరేషన్ సిందూర్‌పై ” మే బీ జస్టిస్ సర్వ్డ్.. జై హింద్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టాడు.
ఇండియన్ ఆర్మీకి ఫుల్ సపోర్టు చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేయడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ బన్నీని ఆకాశానికి ఎత్తుతున్నారు. అయితే ఎక్కడ చిక్కు వచ్చి పడింది అంటే.. అల్లు అర్జున్‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఇలా తమ అభిమాన హీరో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ట్వీట్ చేయడంతో అక్కడి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. మా అభిమాన హీరో నుంచి ఇలాంటి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, వెంటనే డిలీట్ చేయమని కోరుతున్నారు. అల్లు అర్జున్ చేసిన పోస్ట్‌పై 40వేలకు పైగా కామెంట్స్, 100వేల డిజప్పాయింట్మెంట్ రియాక్షన్స్ వచ్చాయి. మరి దీనిపై బన్నీ ఏమైన స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.