Fahadh Faasil | టాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించిన అతికొద్ది మంది మాలీవుడ్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఇటీవలే రజినీకాంత్ వెట్టైయాన్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఫహద్ ఫాసిల్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
కాగా ఈ స్టార్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుందని ఇన్సైడ్ టాక్. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని సమాచారం.
తృప్తి డిమ్రి ఇప్పటికే ఇంతియాజ్ అలీ లైలా మజ్ను సినిమాలో నటించింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందని తెలుసుకోవాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
EXCLUSIVE!! #ImtiazAli ropes in Malayalam star #FahadhFaasil and #TriptiiDimri for his next directorial…
Fahadh makes his BOLLYWOOD DEBUT with this unconventional love story, set to go on floors in the first quarter of 2025! https://t.co/9b5Pq0Gc5K
— Rahul Raut (@Rahulrautwrites) December 4, 2024
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?
They Call Him OG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. ట్విటర్‌లోకి ఓజీ డైరెక్టర్ గ్రాండ్ ఎంట్రీ