Naga Vamsi | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫుల్ బిజీ షెడ్యూల్‌తో ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం వీడీ12 (VD12). శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే.
కాగా వీడీ12 అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం నిర్మాతల్లో ఒకరైన సూర్య దేవర నాగవంశీ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఆలస్యానికి గల కారణాలను పక్కన పెడితే.. కంటెంట్ ఎప్పుడు విడుదలైనా.. అది మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది. అది పాట అయినా.. ప్రోమో అయినా.. విజువల్ అయినా లేదా టీజర్ అయినా.. ప్రమోషనల్ మెటీరియల్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు. నేను నిన్ననే టీంతో కలిసి ఫస్ట్ హాఫ్ చూశాను. జెర్సీ లాంటి సున్నితమైన భావోద్వేగ పూరిత సినిమాను తీసిన వ్యక్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడా..? అని మీరంతా ఆశ్చర్యపోతారు.
కేవలం ఫస్ట్ హాఫ్‌కు మాత్రమే ఎడిట్ కాని వెర్షన్ దాదాపు రెండు గంటలు ఉంటుంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఎడిటర్ నవీన్ నూలితో ప్రయాణిస్తున్నా. సాధారణంగా ఏ సినిమా గురించి అతను ఏం చెప్పడు. కానీ నన్ను పిలిచి వీడీ 12 ఫస్ట్ హాఫ్ అద్బుతంగా వచ్చిందని చెప్పారు. నేను అప్డేట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. కానీ పనులు కొనసాగుతున్నాయి. అభిమానులు అప్డేట్ గురించి అడుగుతున్నారు.. కానీ అది నా చేతుల్లో లేదని (నవ్వుతూ) అన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైలర్ అవుతున్నాయి.
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య