Prakash Raj | బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడని తెలిసిందే. ఐదు గంటలపాటు ఈడీ విచారణ కొనసాగింది. విచారణలో ప్రకాశ్ రాజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
విచారణ ముగిసిన అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. రమ్మీ యాప్ ద్వారా తనకు ఒక్క పైసా రాలేదని అన్నాడు. బెట్టింగ్ యాప్ విషయంలో అధికారులకు క్లారిటీ ఇచ్చా. ఈడీ దర్యాప్తునకు సహకరించడం నా బాధ్యత. బెట్టింగ్ యాప్స్ ప్రచారం విషయంలో నిర్వాహకుల నుంచి నాకు డబ్బులు అందలేదు. ఇక నుంచి బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయను. నేను చెప్పిన వివరాలు ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. ఈడీ నన్ను మళ్లీ విచారణకు పిలవలేదన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో స్పీడు పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలనిప్రకాశ్ రాజ్‌తోపాటు పలువురు యాక్టర్లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసుల మేరకు ప్రకాశ్ రాజ్ బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
Pawan Kalyan | ఓజీ కోసం వన్స్‌మోర్ అంటోన్న పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా..?
Vijay Devarakonda | ‘కింగ్డమ్’ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Param Sundari | విడుదల తేదీని ప్రకటించిన జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’