నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎర్రచీర-ది బిగినింగ్’. సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంతో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ నేపథ్యంలో సినిమా ఉంటుందని, ఇటీవల పంపిణీదారులు సినిమా చూసి అభినందించారని, వారి సూచన మేరకు శివరాత్రి సీజన్లో సినిమాను విడుదల చేస్తున్నామని, డివోషనల్ టచ్ ఉన్న థ్రిల్లర్ సినిమా ఇదని మేకర్స్ తెలిపారు.
శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్యచౌదరి, అయ్యప్ప పి.శర్మ, సురేశ్ కొండేటి, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్ పులిగార్ల, నిర్మాతలు: ఎన్.వి.వి.సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్.