Sivakarthikeyan | కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం అమరన్ (Amaran). అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఖుష్బూ సుందర్‌తో చేసిన చిట్‌చాట్ తన ప్రయాణాన్ని గురించి చెప్పుకొచ్చాడు శివకార్తికేయన్ .
ప్రతికూల పరిస్థితులలో డిప్రెషన్ బారి నుంచి ఎలా బయటపడగలిగాడో చెప్పాడు శివకార్తికేయన్. నేను ఇంజినీరింగ్ చేస్తున్న టైంలో తొలిసారి స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేశా. నా స్నేహితులు నన్ను స్టేజీపైకి తోసేశారు. నీకేది ఇష్టమైతే అది చేయ్.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని చెప్పారని గుర్తు చేసుకున్నాడు. తన కాలేజీ రోజుల్లో తన తండ్రి మరణించిన తర్వాత ఎంటర్టైన్మెంట్ను ఓ థెరపీలాగా మార్చుకున్నట్టు చెప్పాడు.
నేను డిప్రెషన్‌కు లోనయ్యా. ఏం చేయాలో నాకు తెలియదు. డిప్రెషన్, ఆ బాధ నుంచి బయటపడేందుకు చప్పట్లు, ప్రశంసలు థెరపీలాగా పనిచేసే స్టేజ్‌పైకి వెళ్లేవాడినంటూ చెప్పుకొచ్చాడు శివకార్తికేయన్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
Kissik | అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ డ్యాన్స్.. కిస్సిక్ ఫుల్ సాంగ్ లాంచ్ టైం ఫిక్స్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన