Sridevi Vijaykumar | ప్రభాస్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఈశ్వర్. శ్రీదేవి విజయ్‌కుమార్ (Sridevi Vijaykumar) హీరోయిన్గా నటించింది. టాలీవుడ్ యాక్టర్ నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’ (Sundara Kanda). వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వృతి వాఘని హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా తెలుగు మీడియాతో చిట్ చాట్ చేసింది శ్రీదేవి. చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటిస్తోన్న ఈ భామ తన కోస్టార్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సూపర్ పాపులారిటీ, స్టార్ డమ్ సంపాదించినప్పటికీ ప్రభాస్ క్యారెక్టర్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. ఎవరూ అందుకోలేని స్టార్డమ్తో విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది శ్రీదేవి. అంతేకాదు సరైన అవకాశమొస్తే ప్రభాస్‌తో మళ్లీ కలసి పనిచేయాలని ఉందని చెప్పుకొచ్చింది.
శ్రీదేవి తనకు ఈశ్వర్ రీరిలీజ్ అయితే చూడాలని కూడా ఉందంటూ చెప్పింది. ఇంకేంటి మరి రానున్న రోజుల్లో అన్నీ కుదిరితే ఈశ్వర్ కాంబినేషన్‌ను మరోసారి చూడొచ్చన్నమాట. మరి ఈశ్వర్ కాంబోలో సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేసేదెవరో చూడాలి.
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?