Raj Kundra | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) నివాసాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు (ED raids) చేపట్టారు. పోర్న్ వీడియోలు తీసిన కేసులో (porn racket case) మనీలాండరింగ్‌కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. రాజ్ కుంద్రా నివాసంతోపాటు కార్యాలయాల్లోనూ ఈడీ తనిఖీలు చేపడుతోంది. సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను 2021 జూన్‌లో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తలిసిందే. ముంబై పోలీసుశాఖకు చెందిన ప్రాపర్టీ సెల్.. పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకోగా అప్పట్లో ఈ వ్యవహారం బయటపడింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామన్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియలు తీస్తున్నట్లు గుర్తించారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన తర్వాత.. వాటిని వీట్రాన్స్‌ఫర్ ద్వారా విదేశాలకు ఆ కామెంట్‌ను పంపిస్తారు.
అయితే భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాలను అక్కడి యాప్స్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులకు ఈ విషయాలు తెలిశాయి. ఈ వ్యవహారంలో ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను రాజ్‌కుంద్రా వద్ద పనిచేసేవాడు. ఉమేశ్ కామత్‌ను అరెస్టు చేసిన తర్వాతే.. ఆ పోర్న్ రాకెట్లో కుంద్రా పాత్ర ఉన్నట్లు తేలింది. విచారణ అనంతరం పక్కా ఆధారాలతో 2021 జులై 20న రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు విడుదలయ్యారు.
Also Read..
Keerthy Suresh | పెళ్లి వార్తల వేళ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేశ్
Nayanthara | ఎలాంటి ఉల్లంఘనా జరగలేదు.. ధనుష్ లీగల్ నోటీసులపై స్పందించిన నయనతార లాయర్
Samantha | సిటాడెల్ సక్సెస్ పార్టీ.. బేబీ జాన్ పాటకు సామ్ – వరుణ్ ధావన్ స్టెప్పులు.. VIDEO