Manchu Lakshmi | మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సందేశాత్మక పోస్ట్‌లు పెడుతుంటారు. వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు. అయితే, ప్రస్తుతం మంచు కుటుంబంలో తీవ్ర గొడవలు (Family Disputes) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ మంచు లక్ష్మి పెడుతున్న పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిన్న తన కుమార్తె నిర్వాణ నవ్వులు చిందిస్తున్న వీడియో షేర్ చేస్తూ.. పీస్ అని క్యాప్షన్ ఇచ్చిన మంచు లక్ష్మి.. ఇవాళ ఓ మోటివేషన్ కొటేషన్ పంచుకున్నారు. ‘ఈ ప్రపంచంలో ఏదీ మనది కానప్పుడు.. ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు’ అంటూ ఓ రచయిత రాసిన సందేశం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మంచు కుటుంబంలో విభేదాలు సినీ ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇన్ని రోజులూ గుట్టుగా సాగిన ఇంటి గొడవలు కాస్తా రచ్చకెక్కాయి. పోలీసు కేసులు, ఘర్షణలకు దారితీశాయి. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. ఈ క్రమంలో రాత్రి అక్కడికి వెళ్లిన జర్నలిస్టులపై (journalists) మోహన్ బాబు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. దాడి అనంతరం మోహన్ బాబు సైతం ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మీడియాపై దాడి కేసులో మోహన్‌బాబుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ల్పల్లిలోని నివాసం వద్ద ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తొలుత ఆయనపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదుచేశారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. దానిని హత్యాయత్నం కేసుగా మార్చారు. 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు.
Also Read..
Mohan Babu | మీడియాపై దాడి.. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు
Nayanthara | నేనెందుకు భయపడాలి..?.. ధనుష్‌తో వివాదంపై నయనతార కామెంట్స్
Mohan babu | మంచు మనోజ్ ఫిర్యాదు.. మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్