Mohan babu | టాలీవుడ్ యాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan babu) ఫ్యామిలీ వార్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు, కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. తొలుత ఈ ఘటనలో మనోజ్ కాళ్లకు గాయాలవడంతో బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరాడు.
ఈ వ్యవహారంలో మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. తనపై 10 మంది వ్యక్తులు దాడి చేశారని, విజయ్, వెంకట్కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని ఇటీవల మనోజ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. మనోజ్‌పై దాడి కేసులో తాజాగా మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు..
ఈ నెల 8వ తేదీన ఉదయం సమయంలో గుర్తు తెలియని పది మంది వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి అరుపులు, కేకలు వేశారని, అడ్డుకోబోయిన తనపై దాడి చేసి పరారయ్యారంటూ మనోజ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దవాఖానలో చికిత్స చేయించుకున్నానని, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!