Indiramma Illu | రూ.30వేలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. తొర్రూర్‌లో అధికారుల పేరుతో లంచం డిమాండ్!
Indiramma Illu | నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలంటే రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
Indiramma Illu | తొర్రూరు, నవంబర్ 15: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలంటే రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఫిర్యాదులు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
తొర్రూరు మున్సిపాలిటీలోని 9వ వార్డు ఆఫీసర్ జలకం మీనేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలకం శ్రీనివాస్ కుమారుడు కలిసి ఓ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తాన్ని తమపై ఉన్న అధికారులకు, మున్సిపల్ కమిషనర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారుల పేర్లు చెప్పి డబ్బులు అడగడం వెనుక ఎవరున్నారు? ఈ వ్యవహారంలో నిజంగా అధికారుల ప్రమేయం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొర్రూరు మండలంలో మొత్తం 519 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వీటిలో పలు ప్రాంతాల్లో ఇళ్ల పంపిణీ పూర్తయింది. అయితే తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మించిన 280 ఇళ్ల పంపిణీ మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ఇళ్ల కేటాయింపుపై నిరుపేదలు ఆశలు పెట్టుకున్నారు. ఈ సమయంలోనే లంచం డిమాండ్ ఆరోపణలు తెరపైకి రావడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
పేదల సొంతింటి కలకు లంచాల అడ్డంకులా?
ఇల్లు లేని నిరుపేదలకు అందాల్సిన ప్రభుత్వ పథకంలో మధ్యవర్తుల ప్రమేయం, డబ్బుల డిమాండ్ ఆరోపణలు రావడం చర్చకు దారితీస్తోంది. అర్హత ఆధారంగా ఇళ్లు కేటాయించాల్సిన చోట డబ్బులు ఇవ్వగలిగిన వారికే ప్రాధాన్యం దక్కుతుందా? అన్న సందేహాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంక్షేమం కోసం అమలు చేసే పథకాల్లో ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు అంటున్నారు.
కలెక్టర్ విచారణకు డిమాండ్
రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవాలు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గోపాలగిరి రోడ్డులోని 280 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టి, రాజకీయ జోక్యం, డబ్బుల డిమాండ్ లేకుండా నిజమైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Illu | రూ.30వేలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. తొర్రూర్‌లో అధికారుల పేరుతో లంచం డిమాండ్!
Kaaka | చిరంజీవి ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికా సింగ్‌తో మాస్ స్టెప్పులు, షూటింగ్ కూడా పూర్తి!
AI Technology | చాట్‌జీపీటీతో అద్భుతం.. రెండున్నరేళ్ల తర్వాత భర్త చెంతకు చేరిన తప్పిపోయిన భార్య!
Sabarimala | శబరిమల ప్రసాదం ఇంటికే డెలివరీ
Ramayana | రామాయణ బాక్సాఫీస్ విధ్వంసం.. 10వ రోజు కూడా తగ్గని జోరు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,228 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

