SP Balasubrahmanyam | ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం..భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. క్లాస్ సాంగ్ అయినా, మాస్ బీట్ అయినా, మెలోడీ సాంగ్ అయినా తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోస్తారు ఎస్పీ బాలు. ప్రపంచవ్యాప్తంగా ఎస్పీ బాలుకు కోట్లాదిమంది అభిమానులున్నారు. నిత్యం ఆయన పాటలను పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఓ దుబాయ్ షేక్ (Dubai sheik) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట పాడిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 1986లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసికల్ సూపర్ హిట్ సినిమా సిరివెన్నెల. ఈ సినిమాలో విధాత తలపున (Vidhata Talapuna song ) వికసించినది ఈ గీతం అంటూ సాగే పాటకు మంత్రముగ్దులవ్వని తెలుగు ప్రేక్షకులుండరంటే అతిశయోక్తి కాదు. ఈ పాటకు దుబాయ్ షేక్ ఫిదా అయిపోయాడు. తెలుగు భాష రాకున్నా ఎంతో కష్టపడి చక్కగా పాట పాడి అందరినీ ఫిదా చేస్తున్నాడు.
‘సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది..నే పాడిన జీవన గీతం..ఈ గీతం..విరించినై విరచించితిని ఈ కవనం..విపంచినై వినిపించితిని ఈ గీతం’ అంటూ చాలా స్పష్టంగా పాడి ఔరా అనిపించాడు. దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాడిన పాట టిక్ టాక్ వీడియోను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు వాట్సాప్ , సోషల్ మీడియా అకౌంట్లలో తెగ షేర్లు చేస్తున్నారు.
Rashmika Mandanna | రష్మిక మందన్నా హింట్ ఇచ్చిందా..!
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?