Sehwag: పవన్ డైలాగ్‌తో సెహ్వాగ్ క్రేజీ వీడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు చుట్టు పక్కన రాష్ట్రాలలోను మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలలోని డైలాగులు పటాకుల్లా పేలుతుంటాయి. వాటిని పలువురు ప్రముఖులు పలు సందర్బాలలో వాడుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది డైలాగ్‌తో పాటు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో అనే డైలాగ్, నేను సింహం లెక్క అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా అనే డైలాగ్ చాలా మంది దగ్గర వింటుంటాం.
తాజగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. గబ్బర్ సింగ్‌లో పవన్ చెప్పిన నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అనే డైలాగ్‌ని పవర్ స్టార్ స్టైల్లో చేసి చూపించాడు. ముద్దుముద్దుగా సెహ్వాగా చెప్పిన డైలాగ్ పవన్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తుంది. ఇది ఎప్పటి వీడియోనో తెలియదు కాని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
2012 మే 11న విడుదలైన ఈ సినిమా విమర్శకుల మరియూ ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాక 63 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఇందులోని కొన్ని మాటలు తూటాల్ల పేలాయి.. అందులో నాక్కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది ఒకటి. దబాంగ్ రీమేక్‌గా గబ్బర్ సింగ్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ కంటే ముందు దాదాపు 10 యేళ్ల వరకు పవన్ కళ్యాణ్‌కు వరుసగా ఫ్లాపులు వచ్చాయి . గబ్బర్ సింగ్ అభిమానుల దాహం తీర్చింది.
Sehwag Naidu mass 🔥🔥🔥 https://t.co/y8fj0674sG
— Chirag Arora (@Chiru2020_) September 6, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

