టాలీవుడ్ యాక్టర్ శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడు. టీంలోకి దేవీ శ్రీప్రసాద్ కు వెల్ కమ్ చెప్తూ హీరో శర్వానంద్ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకున్నాడు.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. శర్వానంద్ మరోవైపు అజయ్ భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. సిద్థార్థ్ మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. శర్వానంద్ మరో సినిమా ఒకే ఒక జీవితం విడుదలకు రెడీ అవుతోంది.
Super Happy to have @ThisIsDSP garu on board 😊#AadavaalluMeekuJohaarlu https://t.co/coaiXVw9gP
— Sharwanand (@ImSharwanand) July 22, 2021
ఇవి కూడా చదవండి..
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?