Drishyam 3 | మాలీవుడ్‌లో తెరకెక్కి.. పలు భాషల్లో విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన చిత్రాల్లో ఒకటి దృశ్యం (Drishyam). మలయాళంలో క్రైం థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ ప్రాంచైజీలో దృశ్యం 3 కూడా వస్తోన్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ (Mohan lal), మీనా లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా సెట్స్‌పై ఉండగానే ఈ చిత్రం థియాట్రికల్, డిజిటల్ రైట్స్ విషయంలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
దృశ్యం 3 థ్రియాట్రికల్, డిజిటల్ రైట్స్ కలిపి ఏకంగా రూ.350 కోట్లు పలికాయని మాలీవుడ్ సర్కిల్ సమాచారం. ఇప్పటివరకు ఇదే టాప్ ఫిగర్ కాగా.. మలయాళ ట్రేడ్ ఎనలిస్టులు ఎవరూ కూడా ఊహించని విధంగా రికార్డు స్థాయిలో రైట్స్ అమ్ముడుపోయి అరుదైన ఫీట్ నమోదు చేసింది దృశ్యం 3.
జార్జ్‌కుట్టీ (మోహన్ లాల్ పాత్ర) ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన దశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని తెరకెక్కిస్తోంది. మరి మూడో పార్టు బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
దృశ్యం కథ తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే తెలుగులో వెంకటేశ్, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
3-digit figures in rights + profit share! 🔥🔥🔥
Aashirvad Cinemas has pulled off massive numbers even before #Drishyam3 has wrapped shooting.
Sources say they’ve already secured a huge 3-digit figure from theatrical + other rights alone 😱🔥
And that’s still not everything —… pic.twitter.com/PkQ5Jlc8MQ
— AB George (@AbGeorge_) December 1, 2025
Raj – Samantha | రెండో పెళ్లికి రెడీ అయిన సమంత.. ఆ పోస్ట్‌తో వచ్చిన పూర్తి క్లారిటీ
Yellamma | ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌పై దిల్ రాజు క్లారిటీ… హీరో, హీరోయిన్ల విషయంలో తొలగిన సస్పెన్స్