Kayadu Lohar | సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు కయాదు లోహర్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్రాగన్’ చిత్రంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చిత్ర పరిశ్రమలోకి 2021లోనే ఎంట్రీ ఇచ్చినా.. ఈ తమిళంలో తొలిసారిగా నటించిన చిత్రమే కయాదుకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ప్రస్తుతం తమిళంలోనే అథర్వ సరసన నటిస్తున్నది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో కయాదు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Kayadu Lohar
తాను దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయినని.. అందరూ కలలను సాకారం చేసుకోవడం కష్టమని చెప్పింది. తాను రాణించి.. లక్ష్యాన్ని సాధించాలని కలలు కంటున్న అమ్మాయిలకు మార్గం సుగమం చేయాలని అనుకుంటున్నానని చెప్పింది. డ్రాగన్‌కు ముందు కయాదు అంటే ఎక్కువ మందికి తెలియదని.. ప్రస్తుతం సినిమాలోని తన పాత్రను ఇష్టపడుతున్నారని.. ఇప్పటికీ తనను కయాదు లోహర్గానే గుర్తిస్తారని చెప్పింది.
Kayadu Lohar
ఇది సాధించడం చాలా కష్టమని.. ఈ ప్రేమను పొందడం తన అదృష్టమని తెలిపింది. దర్శకులు, నిర్మాతలు నాలోని ప్రతిభను గుర్తిస్తున్నారని.. తాను ఎప్పుడు కలలు కనే ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. కాలేజీలో చదువుతున్న సమయంలో టైమ్ ఫ్రెష్ ఫేస్ సీజన్-12లో పాల్గొనాలని తల్లి సూచించిందని.. వేసవి సెలవుల సీజన్ కావడంతో పాల్గొని గెలిచానని చెప్పింది. అప్పుడే ఓ కాస్టింగ్ డైరెక్టర్ యాడ్ కోసం తనను సంప్రదించాడని.. ఆ తర్వాత తొలిసారిగా కన్నడంలో ముగిల్పేటలో హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చిందని పేర్కొంది.
Kayadu Lohar
తనకు ఐదారు సంవత్సరాల వయసు ఉన్న సమయంలో వేదికపై చయ్య చయ్య సాంగ్‌కి వేదికపై డ్యాన్స్ చేశానని.. తనకు ఆ సమయంలో కలిగిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది అని వివరించింది. మాధురి దీక్షిత్, శ్రీదేవిని అనుకరించే దాన్ని అని చెప్పింది. డ్రాగన్ మూవీలో పల్లవి పాత్ర తనకు మంచి పాత్ర అవుతుందని అశ్వత్ (మారిముత్తు) చెప్పారని.. మొదట ఈ పాత్ర కీర్తి (అనుపమ పోషించిన పాత్ర) కోసం తనను సంప్రదించి కథ చెప్పారని.. ఆ తర్వాత నెల రోజుల వరకు తిరిగి ఏం సమాచారం ఇవ్వకపోవడంతో తాను ప్రాజెక్టులో పని చేసే అవకాశం రాదని భావించానని చెప్పింది.
Kayadu Lohar
ఆ తర్వాత డైరెక్టర్ పల్లవి పాత్ర ఇచ్చారని.. డ్రాగన్ మూవీలో పోషించిన ఈ పాత్రకు ఈ స్థాయిలో పేరు వస్తుందని తాను ఊహించలేదనని చెప్పుకొచ్చింది. తాను ఉద్దేశపూర్వకంగా ఇతర భాషా చిత్రాల్లో పని చేయలేదని.. సహజంగానే జరిగిందని తెలిపింది. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ చిత్రాల్లో పని చేయడం చాలాబాగుందని, ప్రతి భాషకు సొంత శైలి, నైపుణ్యాలు ఉన్నాయని చెప్పింది. మలయాళం నేర్చుకోవడం అత్యంత కష్టమని.. ఆ తర్వాత తమిళం, తమిళం, తెలుగు కూడా ఇబ్బందేనని తెలిపింది.
Kayadu Lohar
ఇదిలా ఉండగా.. కయాదు లోహర్ తొలిసారిగా 2021లో కన్నడ చిత్రం ‘ముగిల్పేట’ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత మళయాలంలో ‘పాథోన్పథం నూట్టుండు’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత శ్రీ విష్ణు సరసన ‘అల్లూరి’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరాఠీలో ఐ ప్రేమ్ యూలో కనిపించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘డ్రాగన్’ మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలోనే ‘ఇదయం మురళీ’ మూవీలో అథర్వ సరసన నటిస్తున్నది. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులపై చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది.
Sonu Sood | సోనాలి కోలుకుంటున్నారు.. భార్య హెల్త్ అప్డేట్ ఇచ్చిన సోనూసూద్