Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ (Sonu Sood) భార్య సోనాలి సూద్ (Sonali Sood) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగ్‌పూర్ (Nagpur)లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య సోనాలిసూద్ ఆరోగ్యంపై సోనూసూద్ తాజాగా స్పందించారు. ఈ మేరకు హెల్త్ అప్డేట్ (Sonalis Health Update) ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన భార్య, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కోలుకుంటున్నట్లు చెప్పారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సోనూసూద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
కాగా, సోనాలి సూద్ తన సోదరి, సోదరి కుమారుడితో కలిసి సోమవారం రాత్రి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై – నాగ్‌పూర్ సమృద్ధి హైవేపై (Mumbai – Nagpur highway) వీరి కారు ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోనాలి, ఆమె సోదరి కుమారుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె సోదరి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోనాలి, ఆమె సోదరి కుమారుడు ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో వారి కారు పూర్తిగా దెబ్బతిన్నది.
❤️🙏 pic.twitter.com/P7lnOYYTiM
— sonu sood (@SonuSood) March 26, 2025
Also Read..
Sonu Sood | రోడ్డు ప్రమాదంలో సోనూ సూద్ భార్యకు గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స
Sikandar | మురుగదాస్‌ను ఎత్తుకున్న సల్మాన్ ఖాన్, అమీర్‌ఖాన్.. స్పెషల్ ఏంటో ?
Mangalavaaram 2 | మంగళవారం సీక్వెల్లో శ్రీలీల.?