Sikandar | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ సెలబ్రిటీల్లో ముందు వరుసలో ఉంటారు బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమీర్ ఖాన్ (Aamir Khan) , సల్మాన్‌ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss). ఈ ముగ్గురూ ప్రస్తుతం తమ తమ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా బిజీ షెడ్యూల్‌తో ఉన్న ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది.. మూవీ లవర్స్, అభిమానులకు మాత్రం విజువల్ ఫీస్టే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా ఓ వైపు అమీర్‌ఖాన్ మరోవైపు సల్మాన్ ఖాన్ ఏఆర్ మురుగదాస్‌ను ఎత్తుకొని చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సల్మాన్‌ఖాన్- మురుగదాస్ కాంబోలో వస్తోన్న సికిందర్ (Sikandar). ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సికిందర్ ప్రమోషన్స్‌లో భాగంగా ముగ్గురూ ఇలా సందడి చేశారు.
ఇప్పుడీ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తమ అభిమాన నటీనటులు, దర్శకుడిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫాలోవర్లు ఆనందంలో మునిగితేలుతున్నారు. సికిందర్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ మరో కీ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని ఇన్సైడ్ టాక్.
Epic crossover between Ghajini and Sikandar! 🫂 #SalmanKhan, #AamirKhan and #ARMurugadoss united for a chat ahead of the release of #Sikandar! pic.twitter.com/YUrzJbQlYn
— Bollywood Buzz (@BollyTellyBuzz) March 26, 2025
Thudarum | మోహన్ లాల్‌తో 56వ సినిమా చేస్తున్న శోభన.. ఇంట్రెస్టింగ్గా ‘తుడరుమ్’ ట్రైలర్
Prabhas| ప్రభాస్ పెళ్లిపై కొత్త రూమర్స్.. హైదరాబాద్ అల్లుడు కాబోతున్నాడా..!
Mangalavaaram 2 | మంగళవారం సీక్వెల్లో శ్రీలీల.?