David Warner| స్టార్ హీరో నితిన్, శ్రీలీల కలిసి నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాగానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. వేడుకలో రాజేంద్ర ప్రసాద్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి అందరిచేత చీవాట్లు తిన్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పారు. ఐలవ్ వార్నర్.. ఐ లవ్ క్రికెట్.. డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వార్నర్ పై అనుకోకుండా నా నోటి నుండి మాట దొర్లింది. మేమంతా చాలా క్లోజ్. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడింది కాదు. నా వ్యాఖ్యల వలన ఎవరైన బాధపడితే క్షమించండి అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
అయితే రాజేంద్ర ప్రసాద్ అన్నప్పుడు డేవిడ్ కి భాష రాకపోవడంతో నవ్వుతూ ఉన్నారు. అయితే ఇది ఆ తర్వాత వార్నర్ వరకు వెళ్లింది. దీనిపై డేవిడ్ ఏమన్నాడో రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చాడు. వెంకీ కుడుముల ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. రాజేంద్ర ప్రసాద్ గారు, డేవిడ్ వార్నర్ సినిమా షూటింగ్ లో చాలా క్లోజ్. షూటింగ్ గ్యాప్‌లో ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. నువ్వు యాక్టింగ్ లోకి రా చూసుకుందాం, నువ్వు క్రికెట్ కి రా చూసుకుందాం అని సరదాగా ఛాలెంజ్ లు కూడా విసురుకునే వాళ్లు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఆ పదం అనుకోకుండా మాట్లాడారు. ఈ విషయం గురించి వార్నర్‌కి చెబితే ఇట్స్ ఓకే అన్నారు.
నీకు క్రికెట్ లో స్లెడ్జింగ్ తెలుసా? మేము స్లెడ్జింగ్ చేస్తే చెవుల్లోంచి రక్తం వస్తుంది. మా స్లెడ్జింగ్ ముందు ఇదెంత అని వార్నర్ లైట్ తీసుకున్నారు అంటూ వెంకీ కుడుముల చెప్పుకొచ్చాడు. ఇక రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం మంచి ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డేవిడ్ వార్నర్ ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. భీష్మ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కలిసి చేసిన ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అందరు భావిస్తున్నారు.