తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan). ‘రెమో’, కౌసల్యా కృష్ణమూర్తి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ కోలీవుడ్ యాక్టర్ మే 13న డాన్ (Don) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన డాన్ బాక్సాపీస్ వద్ద తన సత్తా ఏంటో చూపిస్తూ..మంచి కలెక్షన్లు రాబడుతోంది. డాన్ మూవీ కేవలం 12 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి (Don Collections) చేరిపోయింది.
ఇటీవల కాలంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిన్న సినిమాల్లో ఇంత భారీ మొత్తం రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది డాన్.ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే ఉన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి స్పందన వస్తోండటం విశేషం. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది.
కామెడీ డ్రామాగా లైకా ప్రొడక్షన్స్, శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.