YoYo Honey Singh | బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్‌పై గృహ హింస కేసు
బాలీవుడ్ (Bollywood) సింగర్ యో యో హనీ సింగ్ (YoYo Honey Singh) పై ఆయన భార్య శాలిని తల్వార్ గృహ హింస కేసు పెట్టింది.

బాలీవుడ్ (Bollywood) లో యో యో హనీ సింగ్ (YoYo Honey Singh) కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఒక వీడియో చేస్తే చాలు వందల కోట్ల వ్యూస్ వస్తాయి. యూ ట్యూబ్ ను కొన్ని రోజుల పాటు షేక్ చేస్తాయి. ఎప్పుడూ తన పాటలతో ట్రెండింగ్ లో ఉండే ఈయన..ఇప్పుడు వ్యక్తిగత విషయాలతో హైలెట్ అయ్యాడు. ఈయన భార్య శాలిని తల్వార్ కోర్టు మెట్లెక్కింది. యో యో హనీ సింగ్ పై గృహ హింస, లైంగిక ఆరోపణలే కాకుండా ఆర్థిక నేరాలు చేశాడు అంటూ కేసు ఫైల్ చేసింది. ఢిల్లీ టిస్ హజారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది శాలిని తల్వార్.
ఆగస్టు 3న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తానియా సింగ్ ముందు ఈ కేసు నమోదు చేశారు. ఆగస్టు 28 లోపు దీనిపై వివరణ ఇవ్వాలంటూ హనీ సింగ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో శాలిని తరపు లాయర్స్ సందీప్ కుమార్, అపూర్వ పాండే, జీజీ కశ్యప్ కోర్టుకు హాజరయ్యారు. అంతేకాదు ఈ కేసులో శాలినికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కోర్టు హనీ సింగ్ ను తన ఉమ్మడి ఆస్తి వదులుకోవడాన్ని తప్పుపట్టింది.
దీనిపై కూడా స్టే విధించింది. కొన్ని రోజులుగా హనీ సింగ్, శాలిని తల్వార్ మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయని..అవిప్పుడు తీవ్రస్థాయిలో ఉన్నాయని వాళ్ల సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 2014 రియాలిటీ షో ఇండియాస్ రాక్ స్టార్ షోలో తన భార్యను పరిచయం చేశాడు హనీ సింగ్. అంతకు ముందు 2011లో ఎలాంటి సందడి లేకుండా హనీ సింగ్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లపాటు సఖ్యంగానే సాగిన వీళ్ళ కాపురం..ఇప్పుడు కలతల కాపురంగా మారిపోయింది. హనీ సింగ్, శాలిని మధ్య మళ్ళీ ఎప్పుడు మనస్పర్ధలు తొలగిపోతాయా అని కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

