Cinema | సినిమా రంగం (Film Industry) అంటేనే ఇదొక గ్లామర్ ప్రపంచం. సినిమా (Cinema) హీరోలంటే అందరికి క్రేజ్.. అందునా కొంత మంది హీరోల నటనకు, డ్యాన్సులకు ముగ్ధులై వారికి అభిమానులుగా మారిపోతారు. ఇక వాళ్లు తమ అభిమాన హీరో సినిమా విడుదలయ్యిందంటే చాలు ఇక వాళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర బ్యానర్లు,కటౌట్లు, పాలాభిషేకలు, డప్పులు, డ్యాన్సులు ఇవన్నీ థియేటర్ ముందు జరిగే హంగామాలు. అయితే ఈ అభిమానం పేరుతో ఒక్కోసారి కొంత మంది చేసే పనులు తమ అభిమాన హీరోలకు కూడా కోపాన్ని తెప్పిస్తాయి.
ప్రస్తుతం హీరోల సినిమాలు రీరిలీజ్ అనేది ఓ ట్రెండ్‌గా మారింది. తమ అభిమాన హీరోల పాత సినిమాలు వాళ్ల పుట్టినరోజున, లేకపోతే మరే అకేషన్ రోజున రీరిలీజ్ చేస్తున్నారు. తాజాగా మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న మురారి సినిమాను రీరిలీజ్ చేశారు అభిమానులు. దీనికి అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతాకాదు. సినిమా వసూళ్ల పరంగా కూడా అనుకున్న దాని కంటే మంచి స్పందన వచ్చింది.
అయితే కొంత మంది అభిమాన జంటలు ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ వీడియోలను కృష్ణవంశీకి ట్యాగ్ చేస్తూ ఆశీర్వదించండి..అంటూ పోస్టులు పెడుతున్నారు ఈ విషయంపై మురారి చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఘాటుగా స్పందించాడు. ఈ విషయం పట్ల ఆయన ఎంతో అసహనం వ్యక్తం చేశాడు.
మన కల్చర్‌ను అపహాస్యం చేసే ఇలాంటి పనులు చేయకూడదని మీ అందరికి విన్నవించుకుంటున్నాను. మీరు తెలిసి తెలియక అలా చేసి వుంటారు. దయచేసి ఇలాంటి పనులు మళ్లీ చేయకండి’ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
Chiranjeevi | కల్కి 2898 ఏడీ మేకర్స్ తీరుతో చిరంజీవి అభిమానులు అప్సెట్.. కారణమిదేనట..!
They Call Him OG | పవన్ కల్యాణ్ బ్యాక్ టు సెట్స్.. ఓజీ షూట్ డేట్ ఫిక్సయినట్టే..?
Matka | వరుణ్ తేజ్ మట్కా కింగ్ వాసు లుక్ అదిరింది.. !