Varanasi | తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం వారణాసి (Varanasi). ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు లీడ్ రోల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమార్ కీ రోల్లో నటిస్తున్నాడు.
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో కథానుగుణంగా యంగ్ మహేశ్ బాబు రోల్ ఉండబోతుందట. ఇంతకీ ఈ పాత్రలో మరి ఎవరు కనిపించబోతున్నారో తెలుసా..? టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్. ప్రస్తుతానికి ఈ వార్త అఫీషియల్ కాకున్నా మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.
దర్శన్ ఇప్పటికే ఫౌజీ చిత్రంలో యంగ్ ప్రభాస్‌గా నటిస్తున్నాడని తెలిసిందే. మరి మహేశ్ బాబు వారణాసిలో కూడా కనిపించబోతున్నాడంటే దర్శన్ ఇక ఓవర్‌నైట్ స్టార్డమ్ కొట్టేయడం పక్కా అని తెలిసిపోతుంది. మరి వారణాసిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన అందిస్తారేమో చూడాలి.
ఇప్పటికే లాంచ్ చేసిన వారణాసి టైటిల్ గ్లింప్స్‌లో మహేశ్ బాబు త్రిశూలాన్ని చేతపట్టుకుని ఎద్దు (నంది)పై స్వారీ చేస్తున్న విజువల్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఈ మూవీని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Vishal | నటుడు విశాల్‌కు భారీ షాక్.. 30% వడ్డీతో చెల్లించాల్సిందేనంటూ మద్రాసు హైకోర్టు తీర్పు
Zubeen Garg | జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు.. ఆయన్ని హత్య చేశారు : సీఎం హిమంత శర్మ
Ravi Teja | ఇక ఓటీటీలో మాస్ జాతర మొదలు.. రవితేజ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..!