Pragya Jaiswal | కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal). ఆ తర్వాత అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ జబల్ పూర్ భామ తాను సింగిల్‌గా ఉన్నానని, తనకు ఇష్టమైన వ్యక్తితో మింగిల్ అయ్యేందుకు రెడీగా ఉన్నానని చెప్పి అందరికీ షాకిచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో మీరు ఒకవేళ డేట్‌కు వెళ్లాలనుకుంటే ఏ క్రికెటర్‌ను సెలెక్ట్ చేసుకుంటారని ప్రశ్నించాడు యాంకర్. శుభ్‌మన్ గిల్ పేరు చెప్పడంతోనే.. పెద్దగా నవ్విన ప్రగ్యాజైశ్వాల్.. ఎందుకు కాదు..? విధి తలిస్తే ఏదైనా జరుగొచ్చు. నేను విధిని నమ్ముతానంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న డాకు మహారాజ్లో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తయింది.
ఇక అఖండ 2లో మరోసారి బాలకృష్ణకు జోడీగా కనిపింబోతుంది. రామోజీఫిలిం సిటీలో వేసిన సెట్లో సీక్వెల్ షూటింగ్ మొదలు కానుంది. ప్రగ్యా జైశ్వాల్ మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తోన్న టైసన్ నాయుడు చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Sandeham | ఓటీటీలో హెబ్బా పటేల్ ఫీవర్.. ట్రెండింగ్‌లో సందేహం
Trisha | గెట్ రెడీ.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న త్రిష