Nayanthara | నయనతార (Nayanthara) ఈ పేరు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ద కథానాయికగా అందరికి సుపరిచితమే. తెలుగు,కన్నడ,తమిళ భాషల్లో బిజీగా సినిమాలు చేసే ఈ అందాలభామ దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికగా పేరు తెచ్చుకుంది. ఈ క్రేజీ భామ తను హీరోయిన్ అవ్వకపోయి ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యేదాన్ని అని ఇటీవల జరిగిన ఓ ఇంటర్య్వూలో చెప్పింది.
ఈ కేరళ కుట్టి ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ”..మా సొంతూరు కేరళలోని తిరువల్లా. అమ్మ ఓమనా.. నాన్న కుడియాట్టు. నాన్న ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేసేవారు.నా చిన్నతనం అంతా గుజరాత్ లోని జామ్ నగర్లో గడిచింది. నాన్న రిటైర్ అయ్యాక మా సొంతూరు వెళ్ళిపోయాము. అక్కడే నేను ఇంగ్లీష్ లిటరేచర్ లో బి.ఏ చదువుకున్నాను. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకునే దాన్ని .అయితే సినిమాల్లో అడుగుపెట్టడం అనుకోకుండా జరిగిపోయింది. మా పెద్ద నాన్నకు ఒక ప్రకటన సంస్థ ఉండేది. ఆయన తరుచూ నా ఫోటోలు తీసి యాడ్స్ ఏజెన్సీలకు ఇచ్చేవారు. అలా నా ఫోటో చూసిన మలయాళి దర్శకులు ఒకరు `సత్యన్ అంతిక్కండ్ సినిమాలో చేయమని ఆఫర్ ఇచ్చారు. మా ఇంట్లో ఈ విషయం గురించి చెబితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయమని నాకే వదిలేశారు. అయిదే కొద్ది రోజులు ఆలోచించి ఆ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాను. ఆ విధంగా మనసినక్కరే(2003)తో నా సినిమా కెరీర్ ప్రారంభమైంది.
అప్పటికి నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఆ తరువాత మలయాళి అగ్ర కథానాయకుడైన మోహన్ లాల్ తో రెండు సినిమాల్లో నటించాను.`అయ్యా అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాను. ఆ సినిమాలో శరత్ కుమార్ హీరోగా నటించారు. తమిళంలో రెండో సినిమానే `చంద్రముఖి`. ఆ సినిమా నా కెరీర్లోనే మర్చిపోలేనిది. ఎందుకంటే నా కెరీర్ మలుపు తిరిగింది ఆ సినిమాతోనే. తరువాత తెలుగులో వెంకటేష్ హీరోగా `లక్ష్మి `చిత్రంతో అడుగుపెట్టాను. ఆ విధంగా అన్ని దక్షిణాది భాషల్లో నటించాను. ఇప్పుడు దక్షిణాదిలో ఎక్కడికి వెళ్లినా నాకు అభిమానులు ఉన్నారు.
ఈ విధంగా చాలా తక్కువ సమయంలోనే కథానాయికగా ఉన్నతస్థాయిని చేరుకున్నారు నయనతార. అయితే ఈ భామ సినిమాలలో ఛాన్స్ రాకుండా ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యివుండేదాన్ని అని చెప్పుకొచ్చారు.
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్మార్క్ సినిమానా.. ?
Game Changer | రాంచరణ్ గేమ్ ఛేంజర్లో కాసర్ల శ్యామ్ పాట.. హైప్ క్రియేట్ చేస్తున్న ఎస్ థమన్
Raghava Lawrence | టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ స్టోరీకి రాఘవా లారెన్స్ ఇంప్రెస్ అయ్యాడా..?