Nagarjuna Remuneration |బిగ్బాస్ అనేది తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక వ్యసనంగా మారిపోయింది. ఇప్పటికే 5 సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా 24/7 అంటూ వచ్చింది. అంటే నాన్ స్టాప్ ( Biggboss Nonstop ) ఎంటర్టైన్మెంట్ పేరుతో 24 గంటలు లైవ్ అన్నమాట. టీవీలో కాకుండా ఓటీటీ ఫార్మట్లో దీన్ని మొదలు పెట్టారు. దీనికి కూడా బయట హోస్ట్ ఎందుకు అంటూ నాగార్జునే బాధ్యత తీసుకున్నాడు. ఇప్పటికే 3 సీజన్స్ ఆయన హోస్టింగ్ అదరగొట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాని.. నాని నుంచి నాగార్జున.. హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. ఒకసారి తన చేతుల్లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ వదిలిపెట్టడం లేదు నాగార్జున. ఇందుకోసం నాగార్జున పారితోషికం కూడా భారీగానే అందుకుంటున్నాడు.
రెగ్యులర్ ఫార్మట్ కాకపోయినా కూడా ఓటీటీ బిగ్ బాస్ కోసం భారీగానే అందుకుంటున్నాడు నాగార్జున. దీనికోసం ఆయనకు నిర్వాహకులు ఏకంగా 6 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 5 తెలుగు కోసం ఇంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు మన్మథుడు. అయితే అది టీవీలో వస్తుంది. పైగా దాని ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుంది టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోతాయి. కోట్లకు కోట్లు ఓట్లు పడతాయి. కానీ ఓటీటీ ఫార్మట్లో ఇవన్నీ జరుగుతాయనే గ్యారెంటీ లేదు.
గంటా రెండు గంటలు అయితే చూస్తారు కానీ 24 గంటలు ఎవరు చూస్తారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. పైగా ఓటీటీ సీజన్ మొదలై నాలుగు రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ దీనిపై పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపించడం లేదు. 84 రోజుల పాటు ఈ రియాలిటీ షో జరుగనుంది. అంటే 12 వారాలన్నమాట. మొత్తం 24 ఎపిసోడ్లు నాగార్జున హోస్ట్ చేయనున్నాడు. ఒక్కో ఎపిసోడ్కు 25 లక్షల చొప్పున 6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2 కోట్ల అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలినవి సీజన్ పూర్తయ్యేలోపు ఇవ్వనున్నారు. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు రియాలిటీ షోలతో నాగార్జున ఫుల్ బిజీగా ఉన్నాడు.
Divya: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ ఎవరు, ఎంత గెలుచుకుంది?”
Heroine childhood Still | టాలీవుడ్ భామ చిన్ననాటి ఫొటో..ఎవరో గుర్తుపట్టారా..?
ఆకట్టుకుంటున్న ‘రాధేశ్యామ్’ రిలీజ్ ట్రైలర్
జేమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్.. పునీత్ పవర్ కనిపిస్తుంది..