Radhe Shyam Trailer | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. ‘జిల్’ ఫేం రాధా కృష్ణ కమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీదలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్, పాటలు ఇలా ప్రతి ఒక్కటి సినిమా పైన భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడతాం..మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి’ అంటూ ప్రభాస్ వాయిస్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ‘చెయ్యి చూసి ఫ్యూచర్‌ని వాయిస్ విని పాస్ట్‌ని కూడా చెప్పేస్తావా’ అంటూ వచ్చే సంభాషణలు ప్రభాస్ పాత్ర గొప్పతనాన్ని చెబుతున్నాయి. ‘ఇంకొకసారి చెయిచూడు’ అని జగపతి బాబు అడగ్గా నాకు రెండో సారి చేయి చూసే అలవాటు లేదు అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తను జ్యోతిష్యంలో ఎంత ప్రవీణ్యుడో అని చెప్పుతున్నట్లు ఉంది. ప్రేమ విషయంలో ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు అని పూజా పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.’ప్రేమకి విధికి మధ్య జరిగే యుద్ధమే రాధేశ్యామ్’ అంటూ రాజమౌళి వివరణ చక్కగా ఉంది. ఒక విజువల్ వండర్‌ను ట్రైలర్లో చూస్తున్నట్లు మేకర్స్ అద్భుతంగా ట్రైలర్‌ను కట్ చేశారు. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో ఉంది.
పిరియాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేకర్స్ అత్యంత భారీగా దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సౌత్‌లో జస్టిన్ ప్రభాకరణ్ సంగీతాన్ని అందించగా బాలీవుడ్లో సచిత్ బల్హరా, అంకిత్ బల్హరా, మితున్, అమల్ మాలీక్, మనన్ భరద్వాజ్‌లు సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.