e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Divya: బిగ్ బాస్ ఓటీటీ విన్న‌ర్ ఎవ‌రు, ఎంత గెలుచుకుంది?

Divya: బిగ్ బాస్ ఓటీటీ విన్న‌ర్ ఎవ‌రు, ఎంత గెలుచుకుంది?

క‌ర‌ణ్ జోహార్ వ్యాఖ్యాత‌గా మొద‌లైన బిగ్ బాస్ ఓటీటీ కార్య‌క్ర‌మం ఎట్ట‌కేల‌కు ముగిసింది. సెప్టెంబర్ 18న జ‌రిగిన గ్రాండ్ ఫినాలేలో దివ్య బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకుంది. నిషాంత్‌ భట్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచాడు. షమితా శెట్టి, రాకేశ్‌ బాపత్‌, ప్రతీక్‌ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలలో నిలిచారు. విజేత‌గా నిలిచిన దివ్య పాతిక ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ గెలుచుకుంది.

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్ బాస్ సీజ‌న్ 15 మ‌రి కొద్ది రోజుల‌లో మొదలు కానుండ‌గా, ఈ సీజ‌న్‌కి ముందు ప్రయోగాత్మ‌కంగా బిగ్ బాస్ ఓటీటీని ప్ర‌వేశ పెట్టారు. ఏడు వారాలపాటు ప్రసారమైన ఈ మినీ బిగ్‌బాస్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇందులో విజేత‌గా గెలిచిన దివ్య సీజ‌న్ 15లో ప్ర‌వేశిస్తుందా లేదా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ఖత్రోన్‌ కీ ఖిలాడీ 11వ సీజన్‌ ఫేమ్‌ వరుణ్‌ సూద్‌తో డేటింగ్ లో ఉన్న‌ట్టు టాక్.

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 15 అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ షో కోసం స‌ల్మాన్ ఖాన్ 14 వారాల‌కిగాను 350 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నాడ‌ని స‌మాచారం. మ‌రోవైపు స‌ల్మాన్ టైగ‌ర్ 3 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న‌విష‌యం తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement