జేమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్.. పునీత్ పవర్ కనిపిస్తుంది..
James Pre release Business | దివంగత కన్నడ పవర్ స్టార్ ( Power star ) పునీత్ రాజ్‌కుమార్ ( Puneeth Rajkumar )చివరి సినిమా జేమ్స్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం కన్నడలో మాత్రమే కాదు మిగిలిన అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే పునీత్ చివరి సినిమా అవుతుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. పైగా ఈయన చనిపోయిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు బాగా ఎమోషనల్ అవుతున్నారు. జేమ్స్ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కూడా దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సెట్ చేసింది. మరోవైపు పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన జేమ్స్ టైటిల్ సాంగ్ అన్ని భాషల్లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుంది.
సాధారణంగానే కన్నడలో పునీత్ సినిమాల బిజినెస్ మరో స్థాయిలో ఉంటుంది. ఇక ఇదే ఆయన చివరి సినిమా అని తెలిసిన తర్వాత ఎంతపెట్టి కొనుక్కోవడానికి అయినా డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం కర్ణాటకలో మాత్రమే జేమ్స్ సినిమా బిజినెస్ రూ.60 కోట్లకు పైగానే జరుగుతుంది. ఇప్పటి వరకు కేజీఎఫ్ 2 మినహా మరే సినిమాకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. పైగా మార్చి 17 నుంచి 24 వరకు కన్నడలో ఇతర సినిమాలు విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ వారమంతా కర్ణాటకలో ప్రతి థియేటర్లో కేవలం పునీత్ రాజ్ కుమార్ సినిమా మాత్రమే ఉండాలని.. అది ఆయనకు తామిచ్చుకునే నివాళి అంటూ చెప్పుకొచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. ఖచ్చితంగా జేమ్స్ కన్నడలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
మరోవైపు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఈ సినిమాకు మంచి రేట్ వస్తోంది. తెలుగులో దాదాపు 4 కోట్లకు పైగా జేమ్స్ రైట్స్ అమ్ముడయినట్లు తెలుస్తోంది. తమిళం మలయాళం హిందీలో కూడా పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా మంచి రేటుకు అమ్ముడవుతుంది. కచ్చితంగా అన్ని భాషల్లో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాడీగార్డ్ గా నటించాడు పునీత్. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటించగా.. శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటించాడు. ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది. గతంలో పునీత్ రాజ్ కుమార్‌తో ఈమె నటించిన రాజకుమార సినిమా కన్నడ ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది.
Read More :
Shah Rukh Khan | నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ సినిమా రాబోతుంది.. ‘పఠాన్’ విడుదల ఎప్పుడంటే?
భీమ్లా నాయక్ సినిమాలో వీవీ వినాయక్.. కానీ ఎడిటింగ్‌లో షాక్..
Pawankalyan | సాహో దర్శకుడితో.. పవన్ కళ్యాణ్ మరో తమిళ రీమేక్ చేయబోతున్నాడా?
Nithiin | అలాంటి కథతో నితిన్ తన తదుపరి సినిమా చేయబోతున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

