Shah Rukh Khan | నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ సినిమా రాబోతుంది.. ‘పఠాన్’ విడుదల ఎప్పుడంటే?
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్లు దాటింది. 2018లో వచ్చిన 'జీరో' తర్వాత ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ నుండి సినిమా రాలేదు.
Shah Rukh Khan Pathan movie | బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్లు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ నుండి సినిమా రాలేదు. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పఠాన్’. జాన్ అబ్రహం, దీపికా పదుకునే కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘వార్’ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన షారుఖ్ పోస్టర్స్ సినిమా పైన భారీ అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
‘పఠాన్’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్పై ఆదిత్య చోప్రా అత్యంత భారీగా నిర్మిస్తున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఈ చిత్రం యష్ రాజ్ ఫిలిం బ్యానర్లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఇక ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

