Acharya First Day Target | చిరంజీవి, రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించిన సినిమా ఆచార్య. ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో ఇలా మెరిసి అతిథి పాత్రల్లో మాయమైపోయారు. కానీ ఫుల్ లెన్త్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఈ లోటు తీరుస్తూ కొరటాల శివ ఆచార్య సినిమా చేశాడు. దాంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆచార్య మొదటి రోజు టార్గెట్ ఎంత ఉండబోతుంది అనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా చిరంజీవి సినిమాలకు రికార్డు ఓపెనింగ్స్ ఉంటాయి. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు మొదటి రోజు రూ.35 కోట్లకు పైగా షేర్ వసూలు చేశాయి. దాంతో ఇప్పుడు ఆచార్య మొదటి రోజు ఎంత వసూలు చేయబోతుంది అనే విషయంపై ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు.
చిరంజీవి ఒక్కడు ఉంటేనే రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి. అలాంటిది ఇప్పుడు ఆయనకు రామ్ చరణ్ కూడా తోడయ్యాడు. దాంతో ఆచార్య ఓపెనింగ్స్ అదిరిపోతాయని గట్టిగా నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ మధ్య కాలంలో విడుదలైన పెద్ద సినిమాలన్నీ మొదటి రోజు అద్భుతమైన వసూళ్లు సాధించాయి. కేజీఎఫ్ 2 లాంటి డబ్బింగ్ సినిమా కూడా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 19 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మరోవైపు పుష్ప, భీమ్లా నాయక్ దుమ్ము దులిపేశాయి. ట్రిపుల్ ఆర్కు వచ్చిన ఓపెనింగ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏకంగా రూ.75 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఆచార్య ఈ స్థానంలో నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మూడేళ్ల కింద సైరా సినిమాతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.36 కోట్లు వసూలు చేశాడు చిరంజీవి. ఇప్పుడు కచ్చితంగా అంతకంటే ఎక్కువ వసూలు చేస్తాడని బల్ల గుద్ది చెప్తున్నారు ఫాన్స్. కానీ పాన్ ఇండియా సినిమాలు చూసిన కళ్లతో ఆచార్య పోటీ పడగలదా అనే అనుమానాలు కూడా అందరిలోనూ ఉన్నాయి. కానీ కొరటాల ట్రాక్ రికార్డు.. చిరంజీవి మాస్ ఇమేజ్.. రామ్ చరణ్ అప్పియరెన్స్ అన్నీ కలిసి కచ్చితంగా ఆచార్యకు రికార్డు ఓపెనింగ్స్ తీసుకొస్తాయని ట్రేడ్ బలంగా నమ్ముతోంది. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల వరకు షేర్ వచ్చేలా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల వరకు షేర్ తీసుకురావచ్చు. పాజిటివ్ టాక్ వస్తే ఆ తర్వాత కచ్చితంగా రికార్డులు బద్దలు కావడం ఖాయం.
సిద్ధా పాత్రలో పవన్ కళ్యాణ్.. చిరంజీవి రియాక్షన్ ఏంటంటే..
“Pooja Hegde | హ్యాట్రిక్ కొట్టొద్దు పూజాహెగ్డే..నెటిజన్ల సందేశాలు..!”
Chiranjeevi | తగ్గేదేలే అంటోన్న చిరంజీవి..అభిమానులకు తీపి కబురు..!”
“రిటైర్మెంట్ పై ఆ అగ్ర దర్శకుడు ఇంకా మనసు మార్చుకోలేదా..?”
“చరణ్ ఏడాదిలో ఎన్నిసార్లు అయ్యప్ప మాల వేస్తాడో తెలుసా..?”
ఆచార్య కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటున్న రామ్ చరణ్..”