సిద్ధా పాత్రలో పవన్ కళ్యాణ్.. చిరంజీవి రియాక్షన్ ఏంటంటే..
Acharya | మెగాస్టార్ చిరంజీవితో పాటు మిగిలిన ఆచార్య యూనిట్ అంతా కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అందులో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు.. మరిన్ని ఆసక్తికరమైన విషయాలపై కూడా చిరంజీవి స్పందించాడు. మరీ ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్‌తో పాటు కలిసి నటించడం ఎలా ఉంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రేపు సినిమా చూసిన తర్వాత తనకంటే బాగా చేశాడు అని ప్రేక్షకులు మెచ్చుకుంటారని.. సినిమా సినిమాకు మెరుగవుతున్న చరణ్ యాక్టింగ్ చూసి తనకు గర్వంగా ఉంది అని చెప్పాడు.
అంతే కాదు ఆచార్య సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండుంటే ఎలా ఉండేదనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు మెగాస్టార్. ఆచార్య సినిమాలో చరణ్, చిరంజీవి కలిసి నటించడం అభిమానులకు పండగ. అయితే ఇదే సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండుంటే స్క్రీన్ ప్రజెన్స్ మరింత అందంగా ఉండేదని.. మీకు కూడా అలా అనిపించిందా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు అంతే అందంగా సమాధానం చెప్పాడు చిరంజీవి. సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని.. ఆ అవకాశం దర్శకుడికి చరణ్ ఇవ్వలేదని చెప్పాడు మెగాస్టార్. ఇది కేవలం రామ్‌చరణ్ మాత్రమే చేసే పాత్ర కాదు.. ఇప్పుడున్న ఏ హీరో అయినా చేయగలడని.. కాకపోతే తండ్రీకొడుకులం కాబట్టి అది స్క్రీన్ మీద మరింత అందంగా కనిపిస్తుందని అని తెలిపాడు చిరంజీవి.
ఒకవేళ ట్రిపుల్ ఆర్ కారణంగా రామ్ చరణ్ ఈ సినిమా చేయకపోయి ఉండుంటే.. అప్పుడు పవన్ కళ్యాణ్ ఈ పాత్రకు సరిపోయేవాడని చెప్పాడు చిరంజీవి. అయితే తాను రామ్ చరణ్‌తో నటించినా.. కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా ఒకే రకమైన అనుభూతి పొందుతానని చెప్పాడు అన్నయ్య. తనకు ఇద్దరూ ఒక్కటేనని.. పవన్ కూడా తన కొడుకు లాంటి వాడు అని చెప్పాడు చిరంజీవి. అందుకే ఈ సినిమాలో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా తనకు ఇదే రకమైన ఫీలింగ్ వచ్చేది అంటున్నాడు మెగాస్టార్. ఏదైనా ఒకే సినిమాలో పవన్ కళ్యాణ్, చిరంజీవిని కలిసి చూడాలని మెగా అభిమానుల కోరిక చాలా గట్టిగా ఉంది. ఆ కోరిక నెరవేర్చే దర్శకుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి.
Read More :
“Pooja Hegde | హ్యాట్రిక్ కొట్టొద్దు పూజాహెగ్డే..నెటిజన్ల సందేశాలు..!”
Chiranjeevi | తగ్గేదేలే అంటోన్న చిరంజీవి..అభిమానులకు తీపి కబురు..!”
“రిటైర్మెంట్ పై ఆ అగ్ర దర్శకుడు ఇంకా మనసు మార్చుకోలేదా..?”
“చరణ్ ఏడాదిలో ఎన్నిసార్లు అయ్యప్ప మాల వేస్తాడో తెలుసా..?”
ఆచార్య కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటున్న రామ్ చరణ్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

