Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Srinivas Goud | దేశంలో సామాజిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Srinivas Goud | న్యూఢిల్లీ: దేశంలో సామాజిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణనను పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని కోరారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో సుమారు 80 కోట్ల మంది ఓబీసీలు ఉన్నారని, వారి జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కులగణన చేపట్టకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే అవి న్యాయస్థానాల్లో నిలవడం లేదని పేర్కొన్నారు. రెండో విడత జనగణనలో కులగణన లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలను మోసం చేస్తోందని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా కేవలం సీట్లు పెంచితే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయకపోతే దేశవ్యాప్తంగా యువత, ఓబీసీల నుంచి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓబీసీలకు న్యాయం చేసే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గతంలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
తెలంగాణలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతుల ఆత్మహత్యలు, వలసలు మళ్లీ ప్రారంభమయ్యాయని శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీరు సముద్రంలో కలుస్తున్నా తెలంగాణకు తాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. నాగార్జునసాగర్ నీటి పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సాగునీటి పంపకాలపై జరిగిన తప్పిదాలకు అధికారులతో పాటు బాధ్యత వహించాల్సిన మంత్రులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని అంగీకరిస్తే ఇరిగేషన్ మంత్రి, సంబంధిత జిల్లా మంత్రులు బాధ్యత వహించి రాజీనామా చేయాలని అన్నారు. తప్పిదాలకు బాధ్యులైన అధికారులను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సమస్యలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలు, వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
Bhogi Review | ‘భోగి’ సినిమా రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
SONNENTAL | ‘డార్క్’ మేకర్స్ నుంచి మరో క్రేజీ థ్రిల్లర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సోనెంటల్’ ట్రైలర్!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

