Koratala Siva | సినిమా ఇండస్ట్రీకి ఎవరొచ్చినా పదికాలాల పాటు పచ్చగా ఉండాలి.. వీలైనంత సంపాదించుకోవాలి.. ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి.. లాంగ్ కెరీర్ ఉండాలి అనుకుంటారు. అంతేగాని ముందుగానే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకొని ఎవరూ రారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఒక అగ్ర దర్శకుడు తన రిటైర్మెంట్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఇండస్ట్రీకి వచ్చాడు. నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అతనే కొరటాల శివ.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఇప్పటి వరకు ఈయన చేసిన 4 సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. దానికి ముందు బృందావనం, మున్నా, భద్ర, ఒక్కడున్నాడు లాంటి సినిమాలకు రచయితగా పని చేశారు. సింహా సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించారు. దాంతో పాటు మరిన్ని సినిమాలకు కథలు అందించాడు కొరటాల. కానీ పేరు పడలేదు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు కొరటాల. ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఆచార్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు కొరటాల. ఇంత సక్సెస్ఫుల్ కెరీర్ ఉన్న కొరటాల శివ.. తన రిటైర్మెంట్ గురించి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రీకి వచ్చాడు. వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఒక ఇంటర్వ్యూలో ఈయన చెప్పిన నిజం ఇది. దర్శకుడిగా మారినప్పుడే కేవలం 10 సినిమాలు మాత్రమే తెరకెక్కించాలని ముందుగానే ఫిక్స్ అయ్యాడు ఈయన. ఆ తర్వాత ఇండస్ట్రీ లోనే ఉంటాడు.. కానీ దర్శకుడిగా మాత్రం కాదు.
నిర్మాతగా మారి చిన్న సినిమాలు చేయాలని ఉందంటూ గతంలో ఒకసారి చెప్పాడు కొరటాల శివ. దర్శకుడిగా మాత్రం 10 సినిమాలు తీసి రిటైర్ అవుతానని ఒకానొక సమయంలో ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడో తాను 10 కథలు రాసి పెట్టుకున్నానని.. వాటిని పూర్తి చేసి నిర్మాతగా మారిపోతాను అంటున్నాడు. అయితే ఇంత టాలెంట్ ఉన్న దర్శకుడు సినిమాలు చేయకుండా ఉంటానంటే మన హీరోలు, నిర్మాతలు అసలు ఒప్పుకుంటారా అనేది అతి పెద్ద అనుమానం. అప్పటి పరిస్థితులను బట్టి మళ్లీ తన నిర్ణయం మార్చుకుంటాడు అనేది అందరూ భావిస్తున్నారు. అదే జరగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో కొరటాల ఏమనుకుంటున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.
“ఎన్టీఆర్ సినిమా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదంట.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కొరటాల”
“ఎన్టీఆర్ సినిమాలోనూ ఆ భామే.. పాత హీరోయిన్ వైపు వెళ్తున్న కొరటాల..”
Chiranjeevi | ఇండస్ట్రీ పెద్ద దిక్కు బాధ్యతపై మెగాస్టార్ చిరంజీవి ఒపీనియన్ ఏంటి?”
ఆచార్య కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటున్న రామ్ చరణ్..”
Acharya | ఇండియాలోని అతిపెద్ద సెట్లలో ధర్మస్థలి సెట్ ఒకటి :కొరటాల శివ”