ఎన్టీఆర్ సినిమాలోనూ ఆ భామే.. పాత హీరోయిన్ వైపు వెళ్తున్న కొరటాల..
Kiara Advani | జూనియర్ ఎన్టీఆర్, కొరటాల సినిమా మొదలు కాకముందు నుంచే చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు అభిమానులు. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి రాజమౌళి తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడం.. మరొకటి అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తుండటం. పైగా ఇద్దరు దర్శకులు తారక్‌కు బాగా కావాల్సిన వాళ్లే. అందుకే ఈ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం తనను తాను చాలా సిద్ధం చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే లుక్ కూడా మార్చేశాడు. ట్రిపుల్ ఆర్ కోసం పూర్తిగా గడ్డంతో కాస్త బరువు కూడా పెరిగి కనిపించిన తారక్.. ఇప్పుడు మాత్రం కొరటాల కోసం కొత్తగా మారిపోయాడు.
నాలుగేండ్ల కింద అరవింద సమేత సినిమాలో ఎలాగైతే ఉన్నాడో.. ఇప్పుడు అలాగే మారిపోయాడు. ఆ లుక్ కోసం చాలా కష్టపడుతున్నాడు జూనియర్. ముఖ్యంగా డైట్ ఫాలో అవుతూ బరువు కూడా బాగానే తగ్గిపోయాడు. ఈ మధ్యే హనుమాన్ మాల వేసిన జూనియర్ ఎన్టీఆర్.. అది పూర్తవ్వగానే కొరటాల ప్రాజెక్టులో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రంలో ముందుగా ఆలియా భట్‌ను హీరోయిన్గా అనుకున్నారు. ఈమె కూడా దీనికి ఓకే అనేసింది. కానీ ట్రిపుల్ ఆర్ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో పాటు ఇప్పుడు ఈమెకు పెళ్లి కూడా కావడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాలని చూస్తుంది ఆలియా. అందుకే తారక్ సినిమా నుంచి తప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈమె స్థానంలో తనకు కలిసొచ్చిన హీరోయిన్ను ఎంచుకుంటున్నాడు కొరటాల. ఆమె ఎవరో కాదు.. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఈయన పరియం చేసిన కియారా అద్వాణి.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణికి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయినా కూడా కియారాకు కిరాక్ ఫాలోయింగ్ వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ సినిమా RC15లో హీరోయిన్గా నటిస్తుంది కియారా. తాజాగా ఈమెకు మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చింది. ఎన్టీఆర్ సినిమాలో ఈమెను హీరోయిన్గా ఎంచుకోవాలని చూస్తున్నాడు కొరటాల. తనకు ముందుగానే తెలిసిన అమ్మాయి కావడం.. మంచి నటి కూడా కావడంతో కియారా వైపు మొగ్గు చూపిస్తున్నాడు కొరటాల శివ. జూన్ నుంచి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఏదేమైనా వరసగా స్టార్ హీరోలతో ఛాన్సులు అందుకుంటూ అందనంత ఎత్తుకు చేరిపోతుంది కియారా అద్వానీ.
Read More :
“Kiara Advani | ఆ టైంలో కియారా చేసిన పనికి బ్లాక్ లిస్ట్‌లో పెట్టారంట”
“Kiara Advani | మ్యాగజైన్ కోసం వయ్యారాలు ఒలకబోసిన కియారా అద్వానీ..”
“Kiara Advani | ఫొటోషూట్‌లో రెచ్చిపోయిన కియారా అద్వానీ..”
Kiara: కియారా పోలికలతో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు?”
“Kiara Advani: కాస్ట్లీ కార్లని కొనుగోలు చేస్తున్న అందాల ముద్దుగుమ్మలు.. ఏంటి కథ?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

