Kiara Advani | ‘లస్ట్ స్టోరీస్’లో బోల్డ్ కంటెంట్‌తో బోలెడు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన అందాల భామ.. కియారా అడ్వాణీ. పాలుగారే చెక్కిళ్లు, కైపెక్కించే కళ్లతో తొలిచూపులోనే కుర్రకారు మనసు దోచిన కియారా ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. వరుస షూటింగ్‌లతో బిజీబిజీగా ఉన్న ఈ బాలీవుడ్ చిన్నది తన గురించి పంచుకున్న ముచ్చట్లు..
చిన్నప్పటి కల?
ఊహ తెలిసినప్పటినుంచీ హీరోయిన్ కావాలన్నదే నా కల.
చదువుకునే రోజుల్లో చేసిన చిలిపి పనులు?
స్కూల్ డేస్‌లో ఎక్కువగా బంక్ కొట్టేదాన్ని. దాంతో నా పేరు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేవారు. అదంతా చూసి అమ్మ బాధపడేది.
మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విసిగించే సందర్భం?
షూట్ నుంచి ఇంటికి రాగానే నేను చెప్పే కబుర్లు వినాలనుకుంటారు. నాకేమో రూమ్‌కి వెళ్లిపోయి హాయిగా పడుకోవాలని ఉంటుంది.
మిమ్మల్ని, మీ స్టైల్‌ని ఒక సినిమాతో పోల్చుకోమంటే?
‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ షాపహాలిక్’
బాల్యంలో సోదరుడితో గిల్లికజ్జాలు?
చాలా ఉన్నాయి. మేం బోలెడు అల్లరి చేసేవాళ్లం. ప్రతి ఆదివారం భోజనానికి ముందు ఒక చోటుకు వెళ్లి క్యాండిల్స్ పెట్టి ప్రార్థన చేసే వాళ్లం. అదే నా జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే జ్ఞాపకం.
ఇష్టమైన వంటలు?
చాక్లెట్స్, సుషీ, దోశ.
ప్రేమ గురించి ఒక్క మాటలో
సంతోషం.
మీ దృష్టిలో సోషల్ మీడియాను షేక్ చేసే వ్యక్తి?
రణ్వీర్ సింగ్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తన నోటిఫికేషన్లే.
మీకు బాగా ఇష్టమైన రెడ్ కార్పెట్ లుక్?
ఒక అవార్డు ఫంక్షన్ కోసం రెడ్ సూట్ వేసుకున్నా. ఇప్పటివరకూ నాకు ఇష్టమైన కాస్ట్యూమ్ అదే.
ఎక్కువగా ధరించే దుస్తులు?
జిమ్ సూట్, పైజమాలో కంఫర్ట్‌గా ఫీలవుతాను. భారతీయ సంప్రదాయ దుస్తులంటే ఇష్టం.
దుస్తుల ఎంపికలో మీకు దగ్గర పోలికలు ఉండే పాపులర్ క్యారెక్టర్?
‘ఫ్రెండ్స్’లో రాచెల్.
ఇష్టమైన సినిమా?
కబీర్ సింగ్.
2022లో జరగాలని కోరుకునే విషయాలు?
సంజయ్ లీలా భన్సాలీ సినిమాకు సైన్ చేయాలి. వీలైనన్ని ప్రాంతాల్లో పర్యటించాలి. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ల్లో పాల్గొనాలి.
బాలీవుడ్ తారల్లో ఎవరి చీరకట్టు అందంగా ఉంటుంది?
రేఖగారు.
ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు తప్పకుండా తీసుకెళ్లే మూడు వస్తువులు?
బయటికెళ్తున్నానంటే నాతో ఫోన్ ఉండాల్సిందే. ఇంకా.. లిప్ టింట్, మాస్క్. ప్రస్తుతం మాస్క్ లేకుండా బయటికి వెళ్లలేం కదా! మూడే వస్తువులు అని కండిషన్ పెడితే మాత్రం..
లిప్టింట్ మానేసి శానిటైజర్ తీసుకెళ్తాను.
మీకు భయం కలిగించే విషయం?
నాకు పక్షులంటే భయం. బర్డ్ఫోబియా ఉంది. ఏ పక్షిని చూసినా నా ముఖం మీదికే వస్తుందేమో అనిపిస్తుంది.
బాగా వైరల్ అయిన ఫొటో?
‘డబ్బూ రత్నానీ’ షూట్ కోసం ఆకు అడ్డుగా పెట్టుకుని దిగిన ఫొటో.
“Kiara Advani | మ్యాగజైన్ కోసం వయ్యారాలు ఒలకబోసిన కియారా అద్వానీ..”
“Sidharth Kiara vacation | రొమాంటిక్ వెకేషన్..మాల్దీవుల్లో బాలీవుడ్ ప్రేమ పక్షులు”
“Kiara Advani | కియారా అద్వానీ కిల్లింగ్ లుక్.. ఫిదా అవుతున్న నెటిజన్స్”
“Kiara Advani: కాస్ట్లీ కార్లని కొనుగోలు చేస్తున్న అందాల ముద్దుగుమ్మలు.. ఏంటి కథ?”
Kiara Advani | ఫొటోషూట్‌లో రెచ్చిపోయిన కియారా అద్వానీ..”