ఎన్టీఆర్ సినిమా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కాదంట.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కొరటాల
NTR30 | ఆచార్య సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు ఈయన. కేవలం దర్శకుడిగా మాత్రమే ఉండి తన పని అయిపోయిందని అనుకోకుండా అన్నివిధాలా సినిమా కోసం నిలబడ్డాడు. ఇదే విషయాన్ని రామ్ చరణ్ చెబుతూ కొరటాల శివపై ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కొరటాల శివ.. తన తర్వాత సినిమా గురించి కూడా మాట్లాడాడు.
త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. జూన్ నుంచి ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా మారుతున్నాడు. ఆయనతో పాటు కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా ఉన్నాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు కొరటాల శివ. ఈ సినిమా కథ రాజకీయ నేపథ్యంలో సాగుతుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వీటిని కొట్టి పారేశాడు ఈ దర్శకుడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని ఒక విభిన్నమైన బ్యాక్ డ్రాప్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చాడు కొరటాల. ప్రతి ఒక్కరికి నచ్చేలా ఈ సినిమా కథ ఉంటుందని తారక్ సినిమాపై అంచనాలు పెంచేశాడు కొరటాల.
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో 2016లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. పైగా అందులో జూనియర్ ఎన్టీఆర్ నటన కూడా ముందు సినిమాలతో పోలిస్తే కొత్తగా కనిపించాడు తారక్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. తాజాగా మరోసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథతోనే రాబోతున్నాడు కొరటాల శివ. దీంతో పాటు తారక్ పాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథకు మెరుగులు దిద్దుతున్నాడు. ఈ సినిమాను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ. 2023 మార్చిలో తారక్ కొరటాల సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించబోతోందని తెలుస్తోంది.
Read More :
“Koratala Siva Next Project’s | ఆ ముగ్గురు స్టార్ హీరోలను లైన్లో పెట్టిన కొరటాల శివ?”
ఎన్టీఆర్ సినిమాలోనూ ఆ భామే.. పాత హీరోయిన్ వైపు వెళ్తున్న కొరటాల..”
Jr NTR Deeksha | మాలధారణలో ఎన్టీఆర్..నెట్టింట్లో ఫొటోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్”
“Chiranjeevi | ఇండస్ట్రీ పెద్ద దిక్కు బాధ్యతపై మెగాస్టార్ చిరంజీవి ఒపీనియన్ ఏంటి?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- koratala siva
- NTR
- ntr30
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

