Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్ పోషించిన చిత్రం రాజాసాబ్ (Raja saab). మారుతి డైరెక్షన్లో పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైన రాజాసాబ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
నైజాం వసూళ్లకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ నైజాం ఏరియాలో తొలి మూడు రోజుల్లో రూ.22 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టుకుంది. మరోవైపు నార్త్ అమెరికాలో 2.2 మిలియన్ డాలర్ల (రూ.19 కోట్లకుపైగా)తో దూసుకెళ్తున్నాడు రాజాసాబ్. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సోమవారం విడుదలై సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతుండగా.. మరో మూడు సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి రాజాసాబ్ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. హార్రర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కించారు.
#TheRajaSaab surges ahead 💥
$2.2M+ North America Gross and counting 🔥
ALL PASSES ENABLED for #BlockbusterTheRajaSaab 🤩#Prabhas @peoplemediafcy @rajasaabmovie pic.twitter.com/UvtyrBn1Mx
— The RajaSaab (@rajasaabmovie) January 12, 2026