Nari Nari Naduma Murari | ఎంఆర్పీ ధరలకే టికెట్లు.. నారీ నారీ నడుమ మురారి టీం సంక్రాంతి ఆఫర్
Nari Nari Naduma Murari | సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని పలు చిత్రాలు టికెట్ రేట్లను పెంచుకుని బరిలో దిగుతున్నాయని తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నారీ నారీ నడుమ మురారి టీం మాత్రం మూవీ లవర్స్‌కు శుభవార్తను షేర్ చేసింది.
Nari Nari Naduma Murari | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari). Sharwa 37గా వస్తోన్న ఈ చిత్రానికి సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని పలు చిత్రాలు టికెట్ రేట్లను పెంచుకుని బరిలో దిగుతున్నాయని తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి టీం మాత్రం మూవీ లవర్స్‌కు శుభవార్తను షేర్ చేసింది. సాధారణ టికెట్ ధరలకే ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. శర్వానంద్ టీం తీసుకున్నఈ నిర్ణయం ఖచ్చితంగా సంక్రాంతికి నిర్మాతలకు బాగా కలిసొచ్చే విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్.. ఎంఆర్పీ ధరలకే టికెట్లు.. అదనపు ఛార్జీలు ఏం లేవు.. అంటూ శర్వానంద్ కోడిపుంజును చేపబట్టుకున్న లుక్‌ను షేర్ చేశారు. ఇప్పుడీ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తుండగా.. మేకర్స్ ఇప్పుడు ట్రైలర్‌ను కూడా షేర్ చేశారు. ఆటోడ్రైవరైన కమెడియన్ సత్య ఓ మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చి జాగ్రత్త దింపేసి వెళ్లే క్రమంలో.. ఆ మహిళ డబ్బులు తీసుకో బాబు అని అంటే.. అయ్యో వద్దమ్మా గర్బిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా సత్య అంటాడు. నేను ప్రెగ్నెంట్ కాదు అని ఆ మహిళ అనే ఫన్నీ సన్నివేశంతో షురూ అయింది ట్రైలర్. ఆ తర్వాత బీటెక్ చదివి ఆర్కిటెక్ట్‌గా పనిచేసే క్రమంలో శర్వానంద్‌కు సంయుక్తా మీనన్, సాక్షి వైద్య కలుస్తారు.
ఇద్దరి మధ్య ఎలా నలిగిపోతాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఒక హీరో రెండు ప్రేమకథలు.. ముగింపే లేని సమస్య అంటూ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్! 🔥 MRP ధరలకే టికెట్లు 🎟️
Catch #NariNariNadumaMurari at no extra charges! 🙌
𝐎𝐧𝐥𝐲 𝐄𝐱𝐭𝐫𝐚 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭! 😎🤩💥Watch Trailer here 🔗 https://t.co/Ey0Dd7vDli
Lets Celebrate in theatres from Jan 14 | 5:49 PM onwards… pic.twitter.com/hoWqos3YSx
— BA Raju’s Team (@baraju_SuperHit) January 12, 2026
Read Also :
Varanasi | ‘వారణాసి’తో వరల్డ్ సినిమా లక్ష్యం.. రాజమౌళి–మహేష్ బాబు ప్రాజెక్ట్‌లో మరో షాకింగ్ ఎలిమెంట్!
Allu Arjun | ‘విష్ణు విన్యాసం’ పాటతో ఊహించని వివాదం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
Kalyan- Tanuja | తనూజపై క్రేజీ కామెంట్స్ చేసిన కళ్యాణ్ పడాల .. బిగ్‌బాస్ 9 తర్వాత కూడా కొనసాగుతున్న ఆసక్తి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

