Suthi Velu | నటనలో అన్నీ రకాల పాత్రలను అలవోకగా పోషించి ,అభిమానులను మెప్పించిన అతి కొద్ది మంది మంచి నటుల్లో సుత్తివేలు (Suthi Velu) ఒకరు. తన సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో మరుపురాని ముద్ర వేసుకున్నారు. సుత్తివేలు మొదటగా నాటకాలు వేసేవారు ఆ తరువాత సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన సినిమాలు నాలుగు స్తంభాలాట,రెండు జళ్ళ సీత,శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి సినిమాలలో ఆయన పండించిన హాస్యం ఎప్పటికి చిరస్మరణీయం.
ప్రతి ఘటన, ఒసేయ్ రాములమ్మ, కలికాలం లాంటి చిత్రాలలోను క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ప్రతిభ చాటుకున్నారు. ఈవిధంగా నటనలో హాస్యాన్నివిషాదాన్ని,విలనిజాన్ని, ఒకటేమిటి అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు పోషించి అందరి మన్ననలు పొందిన సుత్తివేలు ,గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తన సినీ ప్రస్థానం ఎలా మొదలైందో చెప్పుకొచ్చారు.`1981 లో `ముద్ద మందారం (Mudda Mandaram) సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన జంధ్యాల , జె.వి.సోమయాజులు గారిని కన్యాశుల్కం నాటకం వేయమన్నారట.
గిరీశం పాత్రకు ఆయన సోదరుడు లేకపోవటంతో మనిషి నూతిలో పడితే అనే మరో పెద్ద నాటకం వేస్తామన్నారు సోమయాజులు. ఈ నాటకంలో 27 పాత్రలు ,సోమయాజులు నాటక బృందం ,ఎల్.సత్యానంద్ నాటక బృందం కూడా కలవగా ఇంకొక మనిషి తక్కువయ్యాడు నాటకానికి, ఆ పాత్ర చేసే ఛాన్స్ నాకు ఇచ్చారు.ఆ ఐదునిమిషాల పాత్ర చూసి జంధ్యాల గారు ముద్ద మందారం సినిమాలో హోటల్ లో రిసెప్షనిస్టు వేషం ఇచ్చారు. ఇదే నా తొలిసినిమా.
ఆ తరువాత మల్లె పందిరి,నాలుగు స్తంభాలాటా,త్రిశూలం,వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాను. ఆ తరువాత చాలా రోజులు ఖాళీగా వున్నాను. కొన్ని రోజులు ఏ సినిమాల్లోను నటించే అవకాశాలు రాలేదు. ఉన్న ఉద్యోగం పోయింది, మరోపక్క ఇద్దరు పిల్లలున్నారు ,అనవసరంగా సినిమాల్లోకి వచ్చాను అనుకున్నాను.
నన్ను నిలబెట్టిన వ్యక్తి ఆయనే..
అపుడు ఇబ్బందులు పడుతున్న సమయంలో టి.కృష్ణ దేశంలో దొంగలు పడ్డారు చిత్రంలో మాస్టారు వేషం ఇచ్చారు. ఆ తరువాత కూడా ఆయన తీసిన ఆరు సినిమాలో ఐదింటిలో నేనున్నాను. సినిమా పరిశ్రమలో నన్ను నిలబెట్టిన వ్యక్తి టి.కృష్ణ అని చెప్పుకుంటాను. అదే విధంగా జంధ్యాల దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోను నాకో పాత్ర తప్పకుండా ఉండేది`అని చెప్పు కొచ్చారు. ఈ విధంగా స్వర్గీయ సుత్తివేలు తను సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసి అందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని స్థాపించుకున్నారు.
Buddy Review | అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం వర్కవుట్ అయిందా.. బడ్డీ ఎలా ఉందంటే..?
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Aamir Khan | క్రేజీ టాక్.. ఆ డైరెక్టర్‌నే నమ్ముకున్న అమీర్‌ఖాన్..!