Karthi | ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. సూపర్ కూల్ యాక్టింగ్‌తో అదరగొట్టేది కొందరైతే.. క్లాస్ మాస్ అప్పీరియెన్స్ ఇస్తూ ఇరగదీసే యాక్టర్లు మరికొందరు. ఈ జాబితాలో టాప్‌లో ఉంటారు కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ (Karthi), టాలీవుడ్ యాక్టర్ మహేశ్ బాబు (Mahesh Babu). యాక్టింగ్‌లో ఎవరి స్టైల్ వారిదే.. ఈ ఇద్దరు లీడింగ్ యాక్టర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ యాక్టర్లు క్లాస్ మేట్స్ అనే విషయం మీకు తెలుసా..? అవును ఇది నిజమే. ఈ విషయాన్ని కార్తీనే స్వయంగా చెప్పాడు. కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది కార్తీ టీం. ఈవెంట్లో సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు కార్తీ.
రానున్న రోజుల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సినిమా చేసే అవకాశాలున్నాయా.. అని ఓ రిపోర్టర్ కార్తీని అడిగాడు. దీనికి కార్తీ స్పందిస్తూ.. సరైన కథ దొరికి అవకాశమొస్తే మహేశ్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అని చెప్పాడు. అంతేకాదు మహేశ్ బాబు, తాను చెన్నై స్కూల్ డేస్‌లో క్లాస్మేట్స్ కూడా అని అన్నాడు కార్తీ. ఇప్పటిదాకా కార్తీ చాలా మందికి తెలియని సర్ప్రైజ్ విషయం చెప్పడంతో ఎక్జయిట్కు లోనవుతున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29 కోసం రెడీ అవుతున్నాడు. త్వరలోనే షూటింగ్ షురూ కానుంది. మరోవైపు కార్తీ సర్దార్ 2తోపాటు పలు సినిమాలను లైన్లో పెట్టాడు.
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Matka | సూపర్ స్టైలిష్‌గా వరుణ్ తేజ్.. మట్కా రిలీజ్ అనౌన్స్మెంట్ లుక్ వైరల్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్