బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ అమెరికా కోడలైన తర్వాత అక్కడే సెటిలైనప్పటికీ ఇండియాలో పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. కాగా సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామకు సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రియాంక చోప్రా న్యూయార్క్ సిటీలో జరిగిన 2023 Met Gala ఈవెంట్లో భర్త నిక్ జోనాస్‌తో కలిసి మెరిసింది. 11.6 క్యారెట్ల డైమండ్ నెక్లెస్‌ను ధరించింది.
ప్రియాంక చోప్రా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెస్మరైజ్ చేస్తూ.. మెడలో వేసుకున్న డైమండ్ నెక్లెస్ (diamond necklace) స్టిల్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. నెట్టింట వైరలవుతున్న ట్వీట్ ప్రకారం ఇంతకీ ఈ నెక్లెస్ ఖరీదెంతో తెలుసా..? సుమారు రూ.204 కోట్లు (USD 25 million). మెట్ గాలా ఈవెంట్ తర్వాత ఈ నెక్లెస్‌ను వేలం వేయబోతున్నారట.
ప్రియాంక చోప్రా వాలెంటినో డిజైన్ చేసిన బ్లాక్ కాస్ట్యూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఖరీదైన నెక్లెస్‌తో హొయలుపోతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్ Love Againలో నటిస్తోంది. సామ్ హెఘాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మే 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Japan | హైదరాబాద్‌లో కార్తీ టీం.. జపాన్ నయా అప్డేట్
NTR 30 | క్రేజీ న్యూస్.. ఎన్టీఆర్ 30లో సీరియల్ నటి..!
Chatrapathi Trailer | స్టైలిష్ మాస్ అవతార్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఛత్రపతి ట్రైలర్