Japan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు కార్తీ (Karthi). క్లాస్, మాస్, యాక్షన్.. ఇలా ఏ జోనర్ సినిమాతో అయినా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. కార్తీ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో స్క్రీనింగ్ అవుతోంది. కాగా కార్తీ నటిస్తోన్న మరో సినిమాకు సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది.
కార్తీ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ జపాన్ (Japan). రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. జపాన్ షూటింగ్లో భాగంగా కార్తీ టీం హైదరాబాద్‌లో ల్యాండింగ్ అయినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం జపాన్ కొత్త షెడ్యూల్ ఇవాళ నగరంలో షురూ అయింది. కార్తీ, ఇతర నటీనటులపై వచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నాడు.
జపాన్‌లో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.