NTR 30 | టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో ఒకటి కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). జనతా గ్యారేజ్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో ఎన్టీఆర్ 30 (NTR 30) వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మత్స్యరంగంపై ఆధారపడే ఓ గ్రామం, హార్బర్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సీరియల్ నటి, అష్టాచమ్మా ఫేం ఛైత్ర రాయ్ (Chaithra Rai) ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందట. .
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఛైత్ర రాయ్ ఇందులో సైఫ్ అలీఖాన్ భార్య పాత్రలో కనిపించబోతుందని ఇన్సైడ్ టాక్. సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఛైత్ర రాయ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాపులర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024 ఏప్రిల్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ కంపోజిషన్‌లో గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలుండబోతున్నాయని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చిందని తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్లో కార్గో షిప్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను విదేశీ ఫైటర్లు, కొత్త టెక్నాలజీ కెమెరాలతో కొరటాల టీం షూట్ చేసింది. ఎన్టీఆర్ 30 చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫర్ కాగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ 30పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
షూట్ లొకేషన్లో రత్నవేలు, అనిరుధ్ ..
Sharing a Lighter Banter with our Rockstar @anirudhofficial ❤️on the sets of #NTR30 @tarak9999 #KoratalaSiva @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/TLAxMND3IT
— Rathnavelu ISC (@RathnaveluDop) March 26, 2023
ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్..
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022