Do Patti | కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కృతి సనన్.. కాజోల్‌తో కలిసి మిస్టరీ థ్రిల్లర్
Do Patti Movie | ఇండియన్ చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంది బాలీవుడ్ సీనియర్ కథానాయిక కాజోల్. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం దోపట్టి. ఈ మూవీని కృతి సనన్ నిర్మించడమే కాకుండా కాజల్‌తో కలిసి నటిస్తోంది. ఈ మధ్యే రీసెంట్గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ తాజాగా పట్టాలెక్కింది.
Do Patti Movie | బాలీవుడ్ సీనియర్ కథానాయిక కాజోల్ (Kajol), స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) మళ్లీ కలిసి నటించబోతున్నారు. వీరిద్దరు ఇంతకుముందు దిల్వాలే (Dilwale) చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shah rukh khan) జోడిగా కాజోల్ నటించగా.. వరుణ్ ధావన్ (Varun Dhawan)కు జోడిగా కృతి సనన్ చేసింది. తాజాగా వీరిద్దరు మళ్లీ కలిసి పని చేయనున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ శశాంక చతుర్వేది (Shashanka Chaturvedi) దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో కాజోల్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో కృతి సనన్ నిర్మాత(Producer)గా మారబోతుంది. ఈ మధ్యే రీసెంట్గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ తాజాగా పట్టాలెక్కింది.
శశాంక చతుర్వేది (బాబ్) దర్శకత్వంలో కాజోల్, కృతి సనన్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి దోపట్టి (Do Patti Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. నార్త్ ఇండియాలో జరిగే ఒక మిస్టరీ థ్రిల్లర్(Mystery Thrillar) గా ఈ సినిమా ఉండనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభంకాగా.. ప్రముఖ నిర్మాత కనికా ధిల్లాన్ క్లాప్ ఇచ్చి.. సినిమా ఓపెనింగ్ చేసింది.
Shot one. Take one. 🎬 #DoPatti is now filming! #DoPattiOnNetflix pic.twitter.com/HrxJrPU2LI
— Netflix India (@NetflixIndia) August 19, 2023
ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని కృతి సనన్ సొంత బ్యానర్ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ (Blu butter fly flims), కథా పిక్చర్స్(Katha Pictures), సంయుక్తంగా నిర్మిస్తుండగా.. కనికా ధిల్లాన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇక ఈ మూవీ 2024లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

I’d say this set of queens is a winning hand, isn’t it @NetflixIndia ?#DoPattiOnNetflix@kritisanon @KanikaDhillon pic.twitter.com/ZbX9BefFxV
— Kajol (@itsKajolD) July 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

